డయాబెటిస్ ఔషధం సితాగ్లిప్టిన్‌ను అతి తక్కువ ధరకే అందించాలని కేంద్రం నిర్ణయం
- మధుమేహాన్ని నియంత్రించే సితాగ్లిఫ్టిన్
- సితాగ్లిఫ్టిన్ 50 ఎంజీ పది మాత్రలను రూ. 60కే విక్రయించనున్న కేంద్రం
- వీటితోపాటు సితాగ్లిఫ్టిన్ 100 ఎంపీ, సితాగ్లిఫ్టిన్, మెట్‌పార్మిన్ మిశ్రమ ట్యాబ్లెట్లు కూడా విక్రయం
- ప్రధానమంత్రి జన ఔషధి మందుల దుకాణాల ద్వారా అందుబాటులోకి
ఇవే మాత్రలను ప్రముఖ బ్రాండ్లు రూ. 162-258 మధ్య విక్రయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 8,700 ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన జనరిక్ మందులను విక్రయిస్తున్నట్టు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన సీఈవో రవి దధీచ్ తెలిపారు.