ఈడీ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: కల్వకుంట్ల కవిత
- ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం
- కవితకు ఈడీ నోటీసులంటూ కథనాలు
- అసత్య ప్రచారం అంటూ ఖండించిన కవిత
- మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యలు
- మీడియా వాస్తవాలను ప్రసారం చేయాలని హితవు
ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఈ వాస్తవాన్ని వెల్లడించడం ద్వారా టీవీ ప్రేక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని దుష్ప్రచారం చేస్తున్న కొందరు వ్యక్తులు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసే కంటే వాస్తవాలనే ప్రచారం చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థలన్నింటిని కోరుతున్నానని కవిత హితవు పలికారు.