కేసీఆర్ తో భేటీ అయిన గుజరాత్ మాజీ సీఎం వాఘేలా

  • జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన కేసీఆర్
  • కీలక నేతలతో వరుసగా సమావేశాలు
  • ఇటీవలే కేసీఆర్ ను కలిసిన కుమారస్వామి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలాతో సమావేశమయ్యారు. హైదరాబాద్ కు వచ్చిన వాఘేలా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరిరువురూ జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చించారు. ఇటీవలే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాదుకు వచ్చి కేసీఆర్ తో సమావేశమయ్యారు. వాఘేలాతో కేసీఆర్ సమావేశం తాజాగా ప్రాధాన్యతను సంతరించుకుంది.


More Telugu News

KCR TRS Shankar Singh Vaghela Gujarat