ఖర్కివ్‌లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. ఓ గొయ్యిలో 440కిపైగా మృతదేహాలు
- రష్యా దళాల నుంచి ఇటీవల ఖర్కివ్‌ను స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ సేనలు
- ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బలు
- ఓ ప్రాంతంలో 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు
అలాగే, అదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు కూడా ఉన్నట్టు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. వీరిని పూడ్చిన ప్రాంతం చుట్టూ వందలాది చిన్నచిన్న సమాధులు ఉన్నట్టు ఆ కథనం పేర్కొంది. ఖర్కివ్ తిరిగి ఉక్రెయిన్ చేతుల్లోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రష్యా ప్రతి చోటా మరణశాసనం రాసిందన్నారు. అప్పట్లో బుచా, మేరియుపోల్ తర్వాత ఇప్పుడు ఖర్కివ్ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.