ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు.. ఐదు రాష్ట్రాల్లో సోదాలు.. హైదరాబాద్, నెల్లూరులో కూడా..!
- తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీల్లో ఈడీ సోదాలు
- మొత్తం 40 లొకేషన్లలో కొనసాగుతున్న రెయిడ్స్
- హైదరాబాద్ లో 20 చోట్ల కొనసాగుతున్న సోదాలు
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఈడీ రెయిడ్లు చేస్తుండటం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత వారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో సోదాలను నిర్వహించింది. అప్పుడు ఏపీలో సోదాలు నిర్వహించని ఈడీ... ఇప్పుడు నెల్లూరులో సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును సీబీఐ కూడా విచారిస్తుండటం తెలిసిందే.