హైదరాబాద్ లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి లాడ్జీకి తీసుకెళ్లి రెండు రోజులపాటు అత్యాచారం
- చంచల్గూడకు చెందిన బాధిత బాలికను అపహరించిన యువకులు
- నాంపల్లి లాడ్జీకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చిన వైనం
- బాలికను అక్కడే వదిలేసి పరారీ
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆపై ఆమెను అక్కడే వదిలేసి లాడ్జీ నుంచి వారు పరారయ్యారు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బాలికకు తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు. తెలిసిన వారు కావడంతో బాలిక వారి మాటలు నమ్మి వెంట వెళ్లినట్టు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు చెప్పారు.