ఈ సినిమా చేయకుండా ఎలా ఉంటాను?: ఎస్వీ కృష్ణారెడ్డి

Nenu Meeku Baga Kavalsinavadini movie update
  • కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు కావాల్సినవాడిని'
  • కథానాయికలుగా సంజన ఆనంద్, సోనూ ఠాకూర్ 
  • మణిశర్మ సంగీతాన్ని అందించిన సినిమా ఇది 
  • ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు
కిరణ్ అబ్బవరం తాజా చిత్రమైన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రేపు థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో సంజనా ఆనంద్ - సోనూ ఠాకూర్ కథానాయికలుగా పరిచయమవుతున్నారు. మరో కీలకమైన పాత్ర ద్వారా సిద్ధార్థ్ మీనన్ కూడా పరిచయమవుతున్నాడు. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమాకి, శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు. 

తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్ ఈ సినిమాలోని ప్రధానమైన అంశం. తండ్రి పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి నటించారు. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాను అంగీకరించడానికి మూలకారణం కోడి రామకృష్ణగారు అయితే, ప్రధానమైన కారణం ఆయన కూతురు దివ్య. కోడి రామకృష్ణగారి బ్యానర్లో ఒక సినిమా చేసే అవకాశం వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు .. అదే పని నేనూ చేశాను.

దర్శకుడు శ్రీధర్ ఈ సినిమాను ఎంతో చక్కగా రూపొందించాడు. హీరో కిరణ్ అబ్బవరం.. హీరోయిన్ సంజన అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఇందాకటి నుంచి అంతా ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. అందుకు కారణం మణిశర్మ సంగీతం. ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.

Go Back to Shorts
Kiran Abbavaram
Sanjana
Sonu
Nenu Meeku Baga Kavalasinavadini Movie

More Telugu News