Andhra Pradesh: అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్.. వెల్ లోకి దూసుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు

TDP MLAs walked into AP Assembly well
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో రచ్చ ప్రారంభమైంది. టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్ అయిందనే తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్... ప్రశ్నోత్తరాల తర్వాత చర్చను చేపడదామని చెప్పారు. దీంతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. 

ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వెల్ వద్దకు వెళ్లిన టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. టీడీపీ సభ్యులు సభకు గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని మంత్రి బుగ్గన మండిపడ్డారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.
Go Back to Shorts
Andhra Pradesh
AP Assembly Session
YSRCP
Telugudesam

More Telugu News