'వెల్ డన్ అన్నా'... అంటూ కిషన్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు
- సీతాఫల్ మండి రైల్వేస్టేషన్ లో లిఫ్ట్ లను ప్రారంభించిన కిషన్ రెడ్డి
- ఎంత పెద్ద ప్రాజెక్టులు తెచ్చారో అంటూ కేటీఆర్ వ్యంగ్యం
- కిషన్ రెడ్డికి ఇదే అతిపెద్ద ఘనత అంటూ ఎద్దేవా
గత కొంతకాలంగా తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ కు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల అది మరింత ముదిరింది. సందర్భం వస్తే చాలు... ఇరు పార్టీల నేతలు పరస్పరం వాగ్బాణాలు విసురుకుంటున్నారు.