జ్ఞానవాపిలో శివలింగానికి హారతి ఇచ్చిన ముస్లింలు.. తమ మద్దతు హిందువులకేనని ప్రకటన
- మసీదు ఆవరణలోని హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు జిల్లా కోర్టు అనుమతి
- హైకోర్టును ఆశ్రయిస్తామన్న ముస్లింలు
- తాము కూడా కేవియట్ దాఖలు చేస్తామన్న హిందువుల తరపు న్యాయవాది
మరోవైపు, జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తామని అంజుమాన్ ఇంతే జామియా కమిటీ పేర్కొంది. ఈ మేరకు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సందర్భంగా వారి తరపు న్యాయవాది మిరాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. జిల్లా కోర్టులో తమకు న్యాయం జరగలేదన్నారు. పైకోర్టును ఆశ్రయించక తప్పేలా లేదన్నారు. కాగా, ఇదే అంశంపై హిందువుల తరపు న్యాయవాది విషు జైన్ మాట్లాడుతూ.. తాము కూడా కేవియట్ దాఖలు చేస్తామని చెప్పుకొచ్చారు.