టాలీవుడ్ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాదం
- మణిశర్మకు మాతృవియోగం
- మణిశర్మ తల్లి సరస్వతి కన్నుమూత
- సరస్వతి వయసు 88 సంవత్సరాలు
- వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న సరస్వతి
మణిశర్మ తండ్రి వైఎన్ శర్మ నాలుగేళ్ల కిందటే మరణించారు. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో మణిశర్మ శోకసంద్రంలో మునిగిపోయారు. మణిశర్మ బాల్యం నుంచే సంగీతం బాటపట్టడానికి తల్లి సరస్వతి ప్రోత్సాహం ఎంతో ఉంది. కాగా, తల్లిని కోల్పోయిన మణిశర్మకు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.