Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖలోని అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహం కూలిపోయే ముప్పు ఉందంటున్న పోలీసులు

Police warns there is a chance that tallest Ganesh Idol in Vizag will collapse
  • గాజువాకలో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన గణేశ్ విగ్రహం
  • 89 అడుగుల ఎత్తుతో భారీ గణపతి
  • ఒక అడుగు మేర పక్కకి ఒరిగిపోయిందంటున్న పోలీసులు
  • వెంటనే నిమజ్జనం చేయాలని సూచన
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కెల్లా అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహం విశాఖలోని గాజువాకలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ఎత్తు 89 అడుగులు. అయితే ఈ విగ్రహం కూలిపోయే ముప్పు ఉందంటూ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని రోజూ వేలాదిగా దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే విగ్రహం ఎడమవైపు ఒక అడుగు మేర పక్కకి ఒరిగిపోయినట్టు గుర్తించారు. 

దాంతో, విగ్రహాన్ని పరిశీలించాలని పోలీసులు ఆర్ అండ్ బి అధికారులను కోరారు. విగ్రహాన్ని పరీక్షించిన ఆర్ అండ్ బి అధికారులు ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయంటూ తమ నివేదికలో స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో, వినాయక విగ్రహాన్ని వెంటనే నిమజ్జనం చేయాలని పోలీసులు మండపం నిర్వాహకులకు సూచించారు. అయితే, ముందస్తు నిమజ్జనానికి నిర్వాహకుల కమిటీ అంగీకరించలేదు. ఈ నెల 18న నిమజ్జనం చేస్తామని నిర్ణయించింది. దాంతో, విగ్రహానికి 100 మీటర్ల లోపు ఎవరినీ అనుమతించవద్దని పోలీసులు తాజా హెచ్చరికలు చేశారు.
Ganesh Idol
Tallest
Gajuvaka
Vizag
Police

More Telugu News