గ్రీన్ కార్డ్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన బైడెన్ సర్కార్
- గ్రీన్ కార్డుల విషయంలో కీలక ఆంక్షలు విధించిన గత ట్రంప్ సర్కార్
- అన్ని నిబంధనలను పక్కన పెట్టేసిన బైడెన్ ప్రభుత్వం
- ఆదాయం, సబ్సిడీలతో సంబంధం లేకుండా అందరూ గ్రీన్ కార్డ్ కు అర్హులే
గత ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డ్ జారీకి సంబంధించి పలు ఆంక్షలను విధించింది. ఫుడ్ స్టాంపులు, హౌసింగ్ వోచర్లు, మెడికల్ సాయం పొందిన వారికి గ్రీన్ కార్డులను నిరాకరించింది. అంతేకాదు, వలసదారుల ఆదాయం, వయసు, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకునేది. వీటన్నింటినీ పక్కన పెట్టిన బైడెన్ ప్రభుత్వం.. గ్రీన్ కార్డుల జారీకీ వీటిని పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించింది. దీంతో, అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి పెద్ద ఊరట లభించినట్టయింది. ముఖ్యంగా ఎన్నారైలకు దీన్ని అతి పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు.