తెలంగాణలో కొత్తగా 128 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 11,398 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 54 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 177 మంది
- ఇంకా 933 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,35,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,30,703 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 933 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
