ఈ నెల 19న లండన్ లో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు
- లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో తుది వీడ్కోలు కార్యక్రమం
- రెండు నిమిషాల మౌనం.. రాచ కుటుంబ సభ్యులు, అభిమానుల నివాళులు
- కింగ్ జార్జ్ 4 మెమొరియల్ చాపెల్ లో ఖననంకు ఏర్పాట్లు
కింగ్ జార్జ్ 4 మెమొరియల్ లో..
రాణి భౌతిక కాయాన్ని ఉంచిన పేటికను రాచకుటుంబ సభ్యులు వెంటరాగా వెస్ట్ మినిస్టర్ అబ్బేకు తరలించనున్నారు. అక్కడ అంతా రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు. తర్వాత పేటికను విండ్సర్ కోటకు తీసుకెళతారు. అందులోని సెయింట్ జార్జ్ చాపెల్ (చర్చ్)కు తరలించి క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియల తంతు పూర్తి చేస్తారు. చివరిగా కింగ్ జార్జ్ 4 మెమొరియల్ చాపెల్ లో ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధి పక్కన ఆమె శవ పేటికను ఖననం చేస్తారు.