గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో... హైదరాబాదులో రెండ్రోజుల పాటు మద్యం దుకాణాల మూసివేత

Two days liquor sales halt in Hyderabad
  • సెప్టెంబరు 9న హైదరాబాదులో గణేశ్ నిమజ్జనం
  • రేపు, ఎల్లుండి మద్యం దుకాణాల బంద్
  • పోలీసు శాఖ ఆదేశాలు
  • మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు
హైదరాబాద్ లో రేపు (సెప్టెంబరు 9) గణేశ్ నిమజ్జన కార్యక్రమం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, నగరంలో రెండ్రోజుల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపరాదని పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాల మూసివేత నేపథ్యంలో, ఈ సాయంత్రం నుంచి నగరంలోని వైన్ షాపుల వద్ద సందడి పెరిగినట్టు తెలుస్తోంది. కాగా, గణేశ్ నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పట్లానే భారీ ఏర్పాట్లు చేసింది.
Go Back to Shorts
Hyderabad
Wine Shops
Ganesh Immersion
Police

More Telugu News