Anand: 'అలిపిరికి అల్లంత దూరంలో' మూవీ టీజర్ రిలీజ్!

  • కొత్త ఆర్టిస్టులతో 'అలిపిరి అల్లంత దూరంలో'
  • తిరుపతి నేపథ్యంలో నడిచే కథ
  • దర్శకుడిగా ఆనంద్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
Alipiriki Allantha Dooramlo Movie Update

ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉంటే చాలు .. చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతున్నాయి. దాంతో వైవిధ్యానికీ .. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ చిన్న సినిమాలు చాలానే వస్తున్నాయి. అలా దాదాపు కొత్త నటీనటులతోనే రూపొందిన సినిమానే 'అలిపిరికి అల్లంత దూరంలో'. తిరుపతి నేపథ్యంలో నడిచే కథ ఇది.
 
దిల్ రాజు చేతుల మీదుగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు, జీవితంలో పైకి రావడానికి ట్రై చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ సవ్యంగా సాగిపోతుందనుకునే లోగానే అతనికి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. అదేమిటనేదే కథ.

ఒక వైపున డబ్బుకి సంబంధించిన సమస్య .. మరో వైపున దానితో ముడిపడిన ప్రేమ .. మధ్యలో నలిగిపోయే హీరో. ఈ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రమేశ్ - రెడ్డి రాజేంద్ర నిర్మించిన ఈ సినిమాకి ఆనంద్ దర్శకత్వం వహించాడు.

More Telugu News