Kiran Abbavaram: 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' నుంచి ట్రైలర్ రిలీజ్!

  • కిరణ్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టయినర్ 
  • కథానాయికగా సంజన ఆనంద్ పరిచయం 
  • కీలకమైన పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • ఈ నెల 16వ తేదీన సినిమా విడుదల  
Nenu Meeku Baga Kavalsinavadini teaser released

కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ ఇది. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాను నిర్మించింది. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కథనాయికగా సంజన ఆనంద్ పరిచయం కానుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'కాస్ట్యూమ్స్ .. కళ్లజోడు చూస్తే అర్థం కావడం లేదూ .. మనం ఊరమాస్' అంటూ తన కేరక్టర్ గురించి కిరణ్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఈ సినిమాలో కిరణ్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడనే విషయం అర్థమవుతోంది. 

ప్రేమ .. పెళ్లి .. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన డ్రామాతో ఈ సినిమా నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే మణిశర్మ నుంచి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్వీ కృష్ణారెడ్డి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తున్నారు. రెండు ఫ్లాపుల తరువాత కిరణ్ నుంచి వస్తున్న ఈ సినిమా ఆయనకి హిట్ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News