విపక్షాలు ఐక్యంగా ఉన్నాయి.. కలిసే పోరాడుతాం: మమతా బెనర్జీ
- 2024 ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా బీజేపీని ఎదుర్కొంటాయన్న మమత
- రాజకీయమంటేనే యుద్ధమని కామెంట్
- మీడియా అసత్య ప్రసారాలు చేస్తోందని ఆరోపణ
మీడియా కూడా అసత్య ప్రచారాలను చేస్తుండటం దురదృష్టకరమని మమత చెప్పారు. తనకు, అభిషేక్ బెనర్జీకి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేసిందని... ఇలాంటి అవాస్తవాలతో టీఆర్పీ పెరగదని అన్నారు. పశువుల స్మగ్లింగ్ కేసులో అనుబ్రత మొండల్ అరెస్ట్ పై మాట్లాడుతూ... ఆయన పోరాట యోధుడిగా జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. పెద్ద నేతలు అరెస్ట్ అయితే, కార్యకర్తలు భయపడతారని వారు భావిస్తున్నారని అన్నారు.