Nagachaitanya: త్వరలో సెట్స్ పైకి వెళుతున్న చైతూ .. కృతి శెట్టి

  • వెంకట్ ప్రభుతో చైతూ ద్విభాషా చిత్రం
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న చైతూ 
  • ఆయన సరసన రెండోసారి కృతి శెట్టి 
  • సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా
Chaitu and krithi Shetty movie update

చైతూ హీరోగా ఇటీవల చేసిన 'థ్యాంక్యూ' సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక కృతి శెట్టి కథానాయికగా ఈ మధ్య చేసిన 'ది వారియర్' .. 'మాచర్ల నియోజక వర్గం' ఫలితాలు నిరాశపరిచాయి. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో తెలుగు .. తమిళ భాషల్లో ఒక సినిమాను రూపొందించడానికి దర్శకుడు వెంకట్ ప్రభు సన్నాహాలు చేసుకుంటున్నాడు.


రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. ఈ సినిమాలో చైతూ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని అంటున్నారు. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే, ఆమె పాత్ర కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. 

శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా, భారీ బడ్జెట్ తో రూపొందనున్నట్టు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే ఈ సినిమా, చైతూ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితం కానుందని అంటున్నారు. యువన్ శంకర్ రాజా ఈ  సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'బంగార్రాజు' తరువాత కలిసి నటిస్తున్న ఈ జంటకి మరో హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News