Team India: భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్‌... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక‌

srilanka wins the toss and elected to bowl first
షార్ట్స్‌లో చూడండి
ఆసియా క‌ప్‌లో నిల‌వాలంటే గెల‌వాల్సిన మ్యాచ్‌ను టీమిండియా మ‌రికాసేప‌ట్లో శ్రీలంక జ‌ట్టుతో ఆడ‌నుంది. దుబాయి ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. టీమిండియాను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఇప్ప‌టికే 3 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా... ఆదివారం జ‌రిగిన హైటెన్ష‌న్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. టైటిల్ రేసులో నిల‌వాలంటే శ్రీలంక‌తో జ‌రుగుతున్న నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలిచి తీరాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ర‌వి బిష్ణోయ్ స్థానంలో సీనియ‌ర్ బౌల‌ర్ ర‌విచంద్రన్ అశ్విన్‌ జ‌ట్టులోకి చేరాడు.
Go Back to Shorts
Team India
Srilanka
Asia Cup

More Telugu News