Arya: 'కెప్టెన్' విషయంలో క్లారిటీ ఇచ్చిన హీరో ఆర్య!

  • 'కెప్టెన్' గా కనిపించనున్న 'ఆర్య'
  • కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి 
  • సంగీత దర్శకుడిగా ఇమాన్ 
  • ఈ నెల 8వ తేదీన సినిమా విడుదల 
Captain Movie Update

ఆర్య హీరోగా తమిళంలో రూపొందిన 'కెప్టెన్' సినిమాను, తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 8వ తేదీన విడుదల చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ టచ్ తో కూడిన యాక్షన్ మూవీ ఇది. ఆర్య జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటించిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ సిమ్రన్ ఒక కీలకమైన పాత్రను పోషించింది.   

తెలుగులో ఈ సినిమా నితిన్ సొంత బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కథ గతంలో హాలీవుడ్ లో వచ్చిన 'ప్రెడేటర్' తరహాలో ఉంటుందనే ఒక టాక్ వచ్చింది. ఈ విషయంపై ఆర్య స్పందిస్తూ .. 'ఆర్నాల్డ్ చేసిన ఆ సినిమాకీ .. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదనీ, పోస్టర్స్ చూసి జనాలు అలా ఊహించుకుని ఉంటారని అన్నాడు. 

దర్శకుడు శక్తి టేకింగ్ .. ఇమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. గ్రాఫిక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అన్నాడు. ఇంతవరకూ ఏ సినిమాకీ పడని కష్టం ఈ సినిమా కోసం తాను పడ్డానని చెప్పాడు. ఈ సినిమా తనకి తప్పకుండా పెద్ద హిట్ ను తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని అన్నాడు.

More Telugu News