దగ్గుబాటి అభిరామ్ 'అహింస' .. షూటింగు పూర్తి!
- తేజ రూపొందించిన 'అహింస'
- హీరోగా రానా తమ్ముడి పరిచయం
- కథానాయికగా గీతిక ఎంట్రీ
- సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ
- వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు
దర్శకుడిగా తేజకి ప్రేమకథాచిత్రాల స్పెషలిస్టుగా మంచి పేరు ఉంది. ఆయన సినిమాల టైటిల్స్ కూడా కొత్తగా ఉంటాయి. అలాంటి తేజ ఈ సారి ఏ జోనర్లో తన సినిమాను వదలనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి ఆయన 'అహింస' అనే టైటిల్ పెట్టడమే అందరిలో కుతూహలాన్ని పెంచుతోంది.
ఈ సినిమాలో అభిరామ్ జోడీగా గీతిక పరిచయం కానుంది. చాలా కాలంగా సినిమాలకి సంగీతాన్ని అందించడాన్ని పక్కన పెట్టేసిన ఆర్పీ పట్నానాయక్, ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తేజ - ఆర్పీ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.