అమరావతి మాస్టర్ ప్లాన్ అక్రమాల కేసులో.. మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
- అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు
- నారాయణ, అంజనీ కుమార్, లింగమనేని రమేశ్ సహా పలువురిపై సీఐడీ కేసులు
- ముందస్తు బెయిల్ కోసం నారాయణ, అంజనీ కుమార్, లింగమనేని రమేశ్ పిటిషన్లు
- నారాయణ, అంజనీ కుమార్‌లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ఈ కేసులో నారాయణతో పాటు లింగమనేని రమేశ్, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీ కుమార్ సహా పలువురు వ్యక్తులపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. వీరందరిపై ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ, అంజనీకుమార్, లింగమనేని రమేశ్ లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు నారాయణ, అంజనీకుమార్‌లకు మాత్రమే మందుస్తు బెయిల్ మంజూరు చేసింది.