పోకో ఎం5 స్మార్ట్ ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్లు ఇవే..
- రెండు వేరియంట్లలో లభ్యం
- 4జీబీ, 64జీబీ ధర రూ.12.499
- 6జీబీ, 128జీబీ ధర రూ.14,499
- ఈ నెల 13న విక్రయాలు
పోకో ఎల్లో, ఐసీ బ్లూ, పవర్ బ్లాక్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ విక్రయాల్లో భాగంగా.. సెప్టెంబర్ 13న ఫోన్ అమ్మకానికి రానుంది. ముందుగా కొనుగోలు చేసే వారికి ఆరంభ వెర్షన్ ను రూ.10,999, హై ఎండ్ వెర్షన్ ను రూ.12,999కే ఇవ్వనున్నట్టు పోకో ప్రకటించింది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. కాకపోతే బాక్స్ లో 22.5 వాట్ చార్జర్ ను పోకో అందించనుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.