రూ.2,000కే నాయిస్ నుంచి నాజూకైన స్మార్ట్ వాచ్
- కలర్ ఫిట్ క్యాలిబర్ గో పేరుతో విడుదల
- ఫ్లిప్ కార్ట్, గోనాయిస్ పోర్టళ్లపై విక్రయాలు
- ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ఫీచర్లు
మొత్తం ఐదు రంగుల్లో ఈ స్మార్ట్ వాచ్ విడుదలైంది. 50 స్పోర్ట్ మోడ్ లు, 150కు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్ లు ఇందులో ఉన్నాయి. గోనాయిస్, ఫ్లిప్ కార్ట్ పోర్టళ్లలో ఇది లభిస్తుంది. 1.69 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో గుండె రేటు, శారీరక కదలికలు, నిద్రించే తీరు, ఒత్తిడి స్థాయిని గుర్తించే సెన్సార్లు ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి. స్మార్ట్ వాచ్ నుంచి కాల్స్ రిజెక్ట్, మ్యూట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.