సర్కారీ పాఠశాలల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ... వివరాలివిగో
- పీఎం- శ్రీ యోజన పథకాన్ని ప్రకటించిన మోదీ
- దీనికింద దేశంలోని 14,500 పాఠశాలలు అభివృద్ధి
- ఇవన్నీ మోడల్ స్కూళ్లుగా మారతాయని ప్రకటన
దీని ప్రకారం, పీఎం- శ్రీ యోజన పేరిట దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంతో ఈ ప్రభుత్వ పాఠశాలలు మోడల్ స్కూళ్లుగా మారతాయని ప్రధాని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మోదీ పేర్కొన్నారు.