Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వీడియో కోసం వేగంగా వెళుతున్న రైలు పక్కన నడిచే యత్నం... ఎలా పడిపోయాడో చూడండి!

Youth escapes life threat after he tried to walk down with running train
  • ఖాజీపేట్ వద్ద ఘటన
  • వేగంగా వస్తున్న రైలు
  • ఒక్కసారిగా పడిపోయిన యువకుడు
  • తప్పిన ముప్పు
  • వీడియో వైరల్
సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల కోసం యువత ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వరంగల్ ప్రాంతంలోనూ ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ వీడియో కోసం రిస్క్ తీసుకున్నాడు. అయితే అతడి అదృష్టం బాగుండి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. వడ్డేపల్లికి చెందిన ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ వీడియో చేసేందుకు రైల్వే ట్రాక్ ను ఎంచుకున్నాడు. 

వేగంగా రైలు వస్తుండగా, దానిపక్కనే తాను నడుస్తున్నట్టు చిత్రీకరించాలని భావించాడు. అనుకున్నట్టుగానే... ఖాజీపేట్ వద్ద ఓ రైలు వేగంగా వస్తుండగా, దానికి అత్యంత దగ్గరగా నడిచే ప్రయత్నం చేశాడు. కానీ ఆ రైలు వేగానికి యువకుడు ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. అయితే అతడికి ప్రాణాపాయం కలగకపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Running Train
Video
Youth
Insta Reels

More Telugu News