దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- 55 వేలకు తగ్గిన క్రియాశీల కేసులు
- గత 24 గంటల్లో కొత్తగా 6,809 కేసులు నమోదు
- 98.69 శాతానికి పెరిగిన రికవరీ రేటు
గత 24 గంటల్లో 8,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటిదాకా 4.38 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగింది. ఇక, వ్యాక్సినేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 213 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 19,35,814 మందికి టీకాలు అందజేసినట్లు వెల్లడించింది.