నాసా అర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా... కారణమిదే
- గత నెల 29న తొలి సారి వాయిదా పడిన ప్రయోగం
- రాకెట్లో ఇంధన లీకేజీ కారణంగా తొలిసారి ప్రయోగం వాయిదా
- తాజాగా అదే సమస్యతో వాయిదా పడిన వైనం
- తిరిగి ఎప్పుడు ప్రయోగించేదీ వెల్లడించని నాసా
తాజాగా శనివారం కూడా గతంలో తలెత్తిన సమస్యే తలెత్తింది. రాకెట్లోని ఇంజిన్ నెంబర్ 3లో ఇంధన లీకేజీ కనిపించగా... దానిని సరిదిద్దే యత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో వరుసగా రెండో పర్యాయం ఆర్టెమిస్- 1ను వాయిదా వేస్తున్నట్లు నాసా శనివారం ప్రకటించింది. అయితే తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టనున్నదీ మాత్రం నాసా వెల్లడించలేదు.