TDP: గాంధీ వంటి వివాదరహితుడిపై కూడా దాడికి పాల్పడటం ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ఠ: మాజీ ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్‌

penamaluru ex mla bode prasad visits chennupati gandhi in hospital
  • విజ‌య‌వాడ‌లో చెన్నుపాటి గాంధీపై దాడి
  • ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆసుప‌త్రిలో గాంధీకి చికిత్స‌
  • గాంధీని ప‌రామ‌ర్శించిన పెన‌మ‌లూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్‌
విజ‌య‌వాడ‌లో టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడిని పెన‌మ‌లూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో గాంధీ కంటికి గాయం కావ‌డంతో ఆయ‌న‌ను న‌గ‌రంలోని ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బోడె ప్ర‌సాద్ ఆసుప‌త్రికి వెళ్లి గాంధీని పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గాయం కార‌ణంగా ర‌క్తంతో త‌డిసిన చొక్కాతో ఉన్న గాంధీ ఫొటోను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వైకాపా గుండాల దాడిలో తీవ్ర గాయాల పాలైన విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకులు సోదరుడు చెన్నుపాటి గాంధీని పరామర్శించి సంఘటన పూర్వాపరాలు వాకబు చేశానని ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ తెలిపారు. గాంధీ వంటి వివాదరహితుడిపై కూడా దాడికి పాల్పడటం జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ఠ అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.
TDP
Chennupati Gandhi
Vijayawada
YSRCP

More Telugu News