Telangana: తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్పీఎస్సీ

tspsc issues notification for filling up of 1540 aee posts
  • 1,540 ఏఈఈ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌
  • ఈ నెల 22 నుంచి ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం
  • ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 14
తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు కేసీఆర్ స‌ర్కారు శ‌నివారం మ‌రో శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుద‌ల అవుతుండ‌గా... తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) శ‌నివారం మ‌రో నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. 

ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు టీఎస్పీఎస్సీ ప్ర‌క‌టించింది. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించి ఈ నెల 22 నుంచి అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.
Telangana
TRS
KCR
TSPSC

More Telugu News