Telangana: సీబీఐ, ఈడీ ఐటీ సంస్థ‌లు మ‌న‌పై ప‌డ‌తాయి.. జాగ్ర‌త్త‌: మంత్రుల‌కు కేసీఆర్ సూచ‌న‌

ts cm kcr alerts his cabinet ministers over cbi and ed raids
  • కేబినెట్ భేటీలో కేంద్రం తీరును ప్ర‌స్తావించిన కేసీఆర్‌
  • సీబీఐ విచార‌ణ విష‌యంలో రాష్ట్రాల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అయ్యేలా చూద్దామ‌ని వ్యాఖ్య‌
  • కేంద్ర మంత్రుల దండ‌యాత్ర మ‌రింత పెరుగుతుంద‌న్న సీఎం
తెలంగాణ కేబినెట్ భేటీలో భాగంగా సీఎం కేసీఆర్ త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులకు ప‌లు స‌లహాలు, సూచ‌న‌లు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు మ‌న‌పై ప‌డ‌బోతోంద‌ని చెప్పిన కేసీఆర్‌... ఎలాంటి త‌ప్పుల‌కు అవ‌కాశాలు లేకుండా జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ ఆయ‌న మంత్రుల‌కు సూచించారు. త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న పార్టీల‌పై బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును గుర్తు చేసిన కేసీఆర్‌... నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థ‌లు మ‌న‌పై ప‌డ‌తాయ‌ని, ఆ సంస్థ‌ల‌కు అవ‌కాశం ఇచ్చే ప‌నులు చేయ‌రాద‌ని హిత‌బోధ చేశారు. బీజేపీ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడుల‌కైనా అంద‌రూ సిద్ధంగానే ఉండాల‌ని కేసీఆర్ సూచించారు. సీబీఐ విచార‌ణ‌ల విష‌యంలో రాష్ట్రాల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామ‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యంలో అవ‌స‌ర‌మైతే న్యాయ పోరాటం చేద్దామ‌ని కూడా కేసీఆర్ అన్నారు. ఇప్ప‌టికే కేంద్ర మంత్రుల దండ‌యాత్ర మొద‌లైంద‌ని, భ‌విష్య‌త్తులో మ‌రింత మేర పెరుగుతుంద‌ని అన్నారు. ఇలాంటి స‌మ‌యంలో రాష్ట్ర మంత్రులు అల‌స‌త్వంగా ఉండొద్ద‌ని కేసీఆర్ సూచించారు.
Telangana
TRS
KCR
Telangana Cabinet
BJP
CBI
Enforcement Directorate
Income Tax

More Telugu News