Alia Bhatt: లైవ్​లో తెలుగు పాట పాడిన అలియా భట్

Alia bhatt sings Bramhastram song in live event
షార్ట్స్‌లో చూడండి
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రంలో కీలకమైన ‘సీత’ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్రం’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అలియా భర్త రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించాడు. అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ కీలక పాత్రలు పోషించారు. 

ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ‘బ్రహ్మస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. గణేశ్ నిమజ్జనం ప్రారంభమైన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు చెప్పడంతో ఈవెంట్ ను రద్దు చేసుకున్న చిత్ర బృందం.. మీడియా సమావేశంలో పాల్గొంది. రణ్‌బీర్, అలియా, నాగార్జున, మౌనీరాయ్, నిర్మాత కరణ్ జొహార్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సమావేశంలో అలియా తన గాత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మల్టీ టాలెంటెడ్ అయిన అలియా లైవ్ లోనే ‘బ్రహ్మస్త్రం’ చిత్రంలోని ‘కుంకుమలా’ అనే పాటను చాలా అందంగా ఆలపించింది. తన ప్రసంగాన్ని తెలుగు పాటతో ముగిస్తానని చెప్పిన అలియా తాను బాగా ప్రిపేర్ అయి వచ్చానని తెలిపింది. 

ఇక ఆమె పాట అందుకోగానే అక్కడున్న అతిథులు, మీడియా ప్రతినిధులు అంతా ఆశ్చర్యపోయారు. ఆమె గాత్రానికి భర్త రణ్ బీర్ అయితే అలా.. ఆమెనే చూస్తుండిపోయాడు. చంద్రబోస్ రాసిన ఈ పాటను సినిమాలో సిధ్ శ్రీరామ్ పాడగా.. అలియా పాట ఫీమెల్ వెర్షన్ లా అనిపించింది.
Go Back to Shorts
Alia Bhatt
singing
Bramhastram
live
event
Jr NTR
Nagarjuna
Rajamouli

More Telugu News