గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ నిందితులను మేజర్లుగా గుర్తించండి... నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్
- మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ ఐదుగురు మైనర్లు
- నిందితులను మేజర్లుగా గుర్తించాలంటూ పోలీసుల పిటిషన్
- ఐదుగురికీ మెచ్యూరిటీ లెవెల్స్ అధికంగా ఉన్నాయని వెల్లడి
- పోలీసుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు
గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డ ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని పోలీసులు తమ పిటిషన్లో కోర్టును కోరారు. ఐదుగురు నిందితులకు మెచ్యూరిటీ లెవెల్స్ అధికంగానే ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా మేజర్లకు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా నిందితులకు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు త్వరలోనే దీనిపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.