బీజేపీపై కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నాం: తమ్మినేని వీరభద్రం
- మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు
- మునుగోడు ఉప ఎన్నిక వరకే మద్దతన్న తమ్మినేని వీరభద్రం
- రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానంలో ఉండేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని వ్యాఖ్య
మునుగోడులో బీజేపీని గెలిపిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని... రాష్ట్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని తమ్మినేని అన్నారు. ఎమ్మెల్యేలను కొనడం, ఈడీని వాడటం వంటి చర్యలతో బీజేపీ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానంలో ఉండేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని తమ్మినేని అన్నారు. టీఆర్ఎస్ కు తమ మద్దతు మునుగోడు ఎన్నికల వరకేనని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నామని అన్నారు.