తెలంగాణలో తాజాగా 190 మందికి కరోనా

Telangana corona media report
  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 14,499 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 82 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 376 మంది
  • ఇంకా 1,738 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 14,499 శాంపిల్స్ పరీక్షించగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

అత్యధికంగా హైదరాబాదులో 82, రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 730 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో 376 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.

తెలంగాణలో ఇప్పటిదాకా 8,34,333 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,28,484 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,738 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Media Report
Bulletin

More Telugu News