మనకు 'సాక్షి' ఉంది కానీ... మనస్సాక్షి లేదు: రఘురామకృష్ణరాజు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అప్పుల్లో ముంచేశారని... ఆయనకు రుణరత్న అవార్డు ఇవ్వాలని విమర్శించారు. కుప్పంలో అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడంపై మండిపడ్డారు. పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దుర్మార్గమని అన్నారు. మనం ఒకరికి పెట్టం.. ఇతరులను పెట్టనివ్వం అని దుయ్యబట్టారు. 

ఉద్యోగులపై మన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని... వారి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. ఉద్యోగుల జోలికి వెళ్లొద్దని... మన పార్టీని ఉద్యోగులకు, ప్రజలకు దూరం చేయవద్దని అన్నారు. మనకు 'సాక్షి' ఉంది కానీ... మనస్సాక్షి లేదని వ్యాఖ్యానించారు.


More Telugu News