ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

  • జనరల్ ఇంటర్ తో పాటు ఒకేషనల్ ఫలితాలు కూడా విడుదల
  • పరీక్షకు హాజరైన దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు
  • పరీక్షల్లో పాస్ అయిన 70.63 శాతం మంది
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఎంవీ శేషగిరి బాబు ఫలితాలను విడుదల చేశారు. ఆగస్ట్ 3 నుంచి 12వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. జనరల్ ఇంటర్ తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు.  

ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్ లో 35 శాతం, ఒకేషనల్ లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ జనరల్ లో 33 శాతం, ఒకేషనల్ లో 46 శాతం మంది పాస్ అయ్యారు. పరీక్షా ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్ సైట్లలోకి లాగిన్ అయి చూసుకోవచ్చు.

Andhra Pradesh
Inter
Supplementary
Results

More Telugu News