బావిలో దూకి చచ్చిపోతానే కానీ.. ఆ పార్టీలో మాత్రం చేరనని చెప్పా: నితిన్ గడ్కరీ
- నితిన్ గడ్కరీ కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం
- తాను ఎప్పటికీ బీజేపీలోనే ఉంటానన్న గడ్కరీ
- కాంగ్రెస్ సిద్ధాంతాలు తనకు నచ్చవని వ్యాఖ్య
కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం తనకు లేదని, తాను బీజేపీలోనే కొనసాగుతానని గడ్కరీ చెప్పారు. కాంగ్రెస్ లో చేరాలని తన స్నేహితుడు, దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కార్ తనను గతంలో కోరారని... అప్పుడు, బావిలో దూకి చచ్చిపోతానే కానీ తాను కాంగ్రెస్ లో మాత్రం చేరనని ఆయనకు చెప్పానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తనకు నచ్చవని చెప్పారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి, ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నాగపూర్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.