Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భయపడితే పాము కాటేసేదే.. కానీ యుక్తి ప్రదర్శించిన మహిళ

Woman chills without worry with a cobra lying on her in viral video
  • చెట్టు కింద మంచంపై పడుకుని ఉన్న మహిళ
  • ఆమె నడుము భాగంలో చేరి పడగ విప్పిన కోబ్రా
  • కదలకుండా అలానే ఉండిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిన పాము
పాము దగ్గరకు వస్తే ఏం చేస్తాం..? కంగారుతో పరుగెత్తుతాం. ఒకవేళ తప్పించుకోలేనంత దగ్గరగా వస్తే..? అప్పుడు బెదిరిపోకుండా, పామును బెదరకొట్టకుండా ఉంటే సరి. పాము తన దారిన అదే పోతుంది. ఓ మహిళ ధైర్యంగా ఇలానే చేసి విషపూరితమైన నాగు పాము నుంచి తన ప్రాణాలను కాపాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేయగా, అది వైరల్ అవుతోంది.

చెట్టు కింద నవారు మంచంపై మధ్య వయసున్న ఓ మహిళ పడుకుని ఉంది. నాగుపాము ఆ మహిళ నడుము భాగంలో చేరి పడగ విప్పి నుంచొంది. కొంచెం కదిలినా కాటు వేయడం ఖాయమన్నట్టుగా కనిపిస్తోంది. కానీ, ఆ మహిళ మాత్రం కొంచెం కూడా కదల్లేదు. బోర్లా పడుకుని, రెండు చేతులతో దేవుడ్ని ప్రార్థిస్తూ నిశ్చలంగా అలాగే ఉండిపోయింది. సమీపంలోనే ఉన్న ఆవు దూడ సైతం ఆ పామును పరిశీలనగా చూస్తోంది. కొన్ని నిమిషాల పాటు ఆ మహిళపై పడగ విప్పి ఉన్న తర్వాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Woman
sleep
cobra
snake
vedio
viral

More Telugu News