ఆసియా కప్: పాకిస్థాన్‌పై భారత ప్రదర్శన అద్భుతమంటూ కొనియాడిన మోదీ
- పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
- ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారన్న ప్రధాని
- గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారంటూ అభినందనలు
పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిందని కొనియాడారు. ప్రత్యర్థిపై గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన భారత జట్టుకు అభినందనలంటూ ట్వీట్ చేశారు.