తెలంగాణలో గత 24 గంటల్లో 175 కరోనా కేసులు

  • తెలంగాణలో కనిష్ఠస్థాయికి కరోనా వ్యాప్తి
  • తాజాగా 12,590 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 98 మంది పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 252 మంది
  • ఇంకా 2,077 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. గడచిన 24 గంటల్లో 12,590 కరోనా పరీక్షలు నిర్వహించగా, 175 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 98 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 132 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. 

అదే సమయంలో 252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,33,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,27,763 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,077 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.

Telangana
Corona Virus
Daily Report
Positive Cases

More Telugu News