టాలీవుడ్ దర్శకుడు బాబీకి పితృవియోగం
- బాబీ తండ్రి మోహనరావు కన్నుమూత
- కాలేయ సమస్యతో బాధపడుతున్న వైనం
- హైదరాబాదులో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం మృతి
ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో నేటి మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మోహనరావు అంత్యక్రియలు రేపు (సోమవారం) గుంటూరులోని నగరంపాలెంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, మోహనరావు మృతితో దర్శకుడు బాబీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.