బాలీవుడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న 'సీతా రామం'
- ఈ నెల 5వ తేదీన విడుదలైన 'సీతా రామం'
- తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
- తమిళ .. మలయాళ భాషల్లోను మంచి వసూళ్లు
- వచ్చేనెల 2వ తేదీన హిందీలో విడుదల
తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి, ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ప్రేమకథగా మార్కులు కొట్టేసింది. తమిళ .. మలయాళ భాషల్లో కూడా చెప్పుకోదగిన వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది.
సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ తరహా ప్రేమకథలను ఎక్కువగా ఇష్టపడతారు. అందునా వాళ్లకి దుల్కర్ .. రష్మికతో పాటు మృణాల్ కూడా బాగా తెలుసు. అందువలన మరింత త్వరగా ఈ కథ వాళ్లకి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.