గాయపడిన పాకిస్థాన్ స్టార్ బౌలర్ ను పరామర్శించిన టీమిండియా క్రికెటర్లు... వీడియో ఇదిగో!
- రేపటి నుంచి ఆసియా కప్
- ఎల్లుండి దాయాదుల సమరం
- గాయంతో జట్టుకు దూరమైన షహీన్ అఫ్రిది
- గాయం వివరాలు అడిగి తెలుసుకున్న భారత క్రికెటర్లు
యజువేంద్ర చహల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్.... అఫ్రిదీని పలకరించి, అతడి గాయం వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు పంచుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది.
కాగా, టీమిండియాతో సమరంలో షహీన్ అఫ్రిదీ లేకపోవడం పాక్ అవకాశాలపై ప్రభావం చూపిస్తుందని మాజీలు అభిప్రాయపడుతుండగా, పాక్ ప్రధాన కోచ్ సక్లాయిన్ ముస్తాక్ మాత్రం అతడి లోటు తెలియనివ్వని బౌలర్లు తమ జట్టులో ఉన్నారని అభిప్రాయపడ్డాడు. మహ్మద్ హస్నైన్, నసీం షా, హరీస్ రవూఫ్ లను ఎదుర్కోవడం టీమిండియాకు అంత తేలికకాదని అన్నాడు.