Trisha: త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరుతోందంటూ ప్రచారం... స్పందించిన తల్లి

Trisha mother condemns the rumors that her daughter will join Congress Party
  • త్రిష పొలిటికల్ ఎంట్రీ అంటూ కథనాలు
  • అవన్నీ పుకార్లేనన్న త్రిష తల్లి ఉమ
  • రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఆమెకు లేదని వెల్లడి
  • ఆమె దృష్టి సినీ కెరీర్ పైనే అని స్పష్టీకరణ
గతంలో పలువురు సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్య మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ కోవలోనే, ప్రముఖ నటి త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరుతోందంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. వీటిపై త్రిష స్పందించలేదు కానీ, ఆమె తల్లి ఉమ స్పందించారు. 

తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. అవన్నీ ఊహాగానాలే అని, వాటిని నమ్మొద్దని అన్నారు. తన కుమార్తె త్రిషకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తారో తెలియదని అసహనం వెలిబుచ్చారు.

త్రిష ప్రస్తుతం సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టిందని ఉమ వివరించారు. తాను నటించే అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నదే ఆమె ఆశయం అని తెలిపారు. త్రిష ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటిస్తోంది.
Trisha
Uma
Rumors
Congress
Political Entry
Cinema

More Telugu News