ఈటల రాజేందర్ తండ్రి మృతికి సంతాపం తెలిపిన కేటీఆర్... కృతజ్ఞతలు చెప్పిన ఈటల
- మంగళవారం రాత్రి చనిపోయిన ఈటల మల్లయ్య
- బుధవారం రాజేందర్ స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
- రాజకీయ వైరాన్ని మరిచి సంతాపం తెలిపిన కేటీఆర్
ఇదిలావుంచితే, పితృవియోగంతో దుఃఖంలో వున్న రాజేందర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ఈటల మల్లయ్య మృతి బాధాకరమన్న కేటీఆర్... ఈటల రాజేందర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈటల మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కేటీఆర్ కోరారు. ఈ ట్వీట్ చేసిన వెంటనే కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ రాజేందర్ రీ ట్వీట్ చేశారు.