బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం.. పాదయాత్రపై లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న బీజేపీ
- నిన్న బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- కరీంనగర్ లోని ఇంటి వద్ద వదిలిపెట్టిన వైనం
- ఈరోజు ఇంటి నుంచే దీక్షను చేపట్టనున్న సంజయ్
ఇంకోవైపు, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పాదయాత్రను ఆపేయాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో యాత్రకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పాదయాత్రను కొనసాగించేలా పోలీసులకు ఆదేశాలను జారీ చేయాలని కోర్టును కోరనున్నారు.