తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్‌లో భర్తీ అయిన ఇంజినీరింగ్ సీట్ల వివరాలివే
- రాష్ట్రంలో కొత్తగా 14 కళాశాలలకు హైకోర్టు అనుమతి
- ఫీజులు నిర్ణయించకుండానే కౌన్సిలింగ్ ఎలా అన్న కళాశాలలు
- ఇప్పటిదాకా కన్వీనర్ కోటాలో 65,633 సీట్ల భర్తీ
ఇదిలా ఉంటే... ఈ ఏడాది కొత్తగా 14 కళాశాలలు ఇంజినీరింగ్ విద్యను బోధించేందుకు హైకోర్టు అనుమతించింది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకే ఫీజులు వసూలు చేస్తామంటూ ఈ విద్యా సంస్థలు చెప్పడంతో హైకోర్టు వాటికి అనుమతి ఇచ్చింది. మరోవైపు ఆయా కళాశాలల్లో ఏ మేర ఫీజులు వసూలు చేయాలన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండానే కౌన్సిలింగ్ ప్రారంభించిందని పలు కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.